: సీనియర్ నేతలతో భేటీ అయిన కిరణ్
కొత్త పార్టీ పెట్టే క్రమంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనతో కలసి వచ్చే నేతలతో వరుసగా భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్, సాయిప్రతాప్, శైలజానాథ్, హర్షకుమార్, సబ్బం హరిలతో భేటీ అయ్యారు. కొత్త పార్టీపై వీరంతా మంతనాలు కొనసాగిస్తున్నారు. పార్టీ విధివిధానాలు, విద్యార్థి, ఉద్యోగ నేతలతో సంప్రదింపులు, మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలు తదితర విషయాలపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.