: ప్రధానితో భేటీ అయిన కేసీఆర్
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపటి క్రితం భేటీ అయ్యారు. తెలంగాణను ఏర్పాటు చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ తేదీని త్వరగా ప్రకటించాలని ఈ సందర్భంగా ప్రధానిని కేసీఆర్ కోరారు. అంతేకాకుండా, తెలంగాణ పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఎయిమ్స్, ఐఐఎంలు ఏర్పాటు చేయాలని... పారిశ్రామిక రంగంలో తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు. తెలంగాణలో 8 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, అందువల్ల తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.