: సోనియా నుంచి కిల్లి కృపారాణికి పిలుపు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నుంచి కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణికి పిలుపు వచ్చింది. ఈ మేరకు రేపు ఉదయం అధినేత్రిని కలవాలంటూ సోనియా కార్యాలయం అధికారులు సమాచారం అందించారు. విభజన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఖాళీ అవడంతో కొత్త సీఎంను నియమించాలనుకుంటున్న కేంద్రం దానిపై రాష్ట్ర నేతలతో వరుసగా చర్చిస్తోన్నట్లు తెలుస్తోంది.