: సోనియా నిర్ణయాన్ని శిరసా వహిస్తాం: పొంగులేటి


తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించినా, లేక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా... సోనియాగాంధీ తీసుకునే నిర్ణయమే తమకు శిరోధార్యమని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు, జగన్ లకు తెలంగాణలో తిరిగే నైతిక హక్కు లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పదవులు అనుభవించిన వారు... ఇప్పుడు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా, జంప్ జిలానీల అవతారం ఎత్తారని విమర్శించారు. ఇలాంటి ఆటుపోట్లను కాంగ్రెస్ పార్టీ ఎన్నో చూసిందని... కాంగ్రెస్ భవిష్యత్తుకు ఢోకా లేదని అన్నారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News