: కొత్త పార్టీపై కిరణ్ మనోగతం
తెలుగుజాతికి జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకే కొత్త పార్టీ ఏర్పాటుకు ముందడగు వేశానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. తన అనుయాయులైన ఎమ్మెల్యేలతో నేడు మరోసారి భేటీ అయిన కిరణ్ పార్టీ ఏర్పాటుపై వారితో చర్చించారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరు ప్రజలను తీవ్రంగా బాధించిందని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికీ తనను సంప్రదిస్తూనే ఉందని కిరణ్ వెల్లడించారు.