: యాసిన్ భత్కల్ కు బిన్ లాడనే ఆదర్శమట!
భారత్ లో పలు పేలుళ్ళకు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ కు అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెనే ఆదర్శమట. ఎన్ఐఏ విచారణలో భత్కల్ ఈ విషయం వెల్లడించాడు. నెట్ నుంచి లాడెన్ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను పెద్ద ఎత్తున డౌన్ లోడ్ చేసుకుని వాటి నుంచి స్ఫూర్తి పొందేవాడని ఎన్ఐఏ అధికారులు వివరించారు. అంతేగాకుండా, ఇతర యువకులనూ లాడెన్ వీడియోలను వీక్షించమని ప్రోత్సహించేవాడట. జిహాద్ ముస్లింల హక్కు అని ఉద్బోధించే ఇతర పుస్తకాలను కూడా జీర్ణించుకున్న యాసిన్, ప్రాణాలను త్యాగం చేయాలని ముస్లిం యువతకు నూరిపోసేవాడు.