: అసెంబ్లీలో విపక్షాల రగడ, రెండోసారి వాయిదా
శాసనసభలో ఇవాళ వాయిదాల పర్వం కొనసాగుతోంది. తొలుత గంటపాటు వాయిదా పడి అనంతరం ప్రారంభమైన సభ ఏ కార్యక్రమం చేపట్టకుండానే మళ్లీ అరగంటపాటు వాయిదా పడింది. ఆయా అంశాలపై విపక్షాలు పట్టువీడక పోవటంతో వాయిదాలు అనివార్యమవుతున్నాయి. ఈ నేపధ్యంలో సభావ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ విద్యుత్ సమస్యపై చర్చకు ప్రభుత్వం సిద్దమని తెలిపారు.
మరోవైపు టీఆర్ఎస్ సడక్ బంద్ అరెస్ట్ లపై వెనక్కితగ్గటం లేదు. ఫలితంగా అన్నిపార్టీల శాసనసభాపక్ష నేతలతో స్పీకర్ భేటీ అయి సభ సజావుగా సాగేందుకు యత్నాలు చేస్తున్నారు.