: పాక్ తాలిబాన్ చీఫ్ అసమతుల్లా మృతి
పాకిస్థాన్లో తాలిబాన్లకు గట్టి ఎదురుదెబ్బ! గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో తాలిబాన్ తాత్కాలిక చీఫ్ అసమతుల్లా షహీన్ మరణించాడు. ఉత్తర వజిరిస్తాన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు భద్రతా దళాలతో పాటు కుటుంబ సభ్యులు కూడా అసమతుల్లా చనిపోయినట్టు ధృవీకరించారు. పాక్ ఆర్మీ రూపొందించిన 20 మంది వాంటెడ్ తీవ్రవాదుల జాబితాలో ఉన్న అసమతుల్లా తలపై ఆ దేశం 2009న 120వేల డాలర్ల నజరానా ప్రకటించింది. కాగా, తాలిబాన్ చీఫ్ హకీముల్లా మసూద్ అమెరికా డ్రోన్ దాడుల్లో హతమవగా, అతని స్థానంలో అసమతుల్లా తాత్కాలిక్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించాడు.