: సుష్మా స్వరాజే తెలంగాణ చాంపియన్: నాగం


బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి తమ అగ్రనేత సుష్మా స్వరాజ్ ను ఆకాశానికెత్తేశారు. సుష్మా స్వరాజే తెలంగాణ చాంపియన్ అని కితాబిచ్చారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, సుష్మా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తే గెలిపించే పూచీ తనదని పేర్కొన్నారు. బీజేపీ వల్లే ప్రత్యేక రాష్ట్ర స్వప్నం సాకారమైందని నాగం చెప్పారు. పార్లమెంటులో బీజేపీ దృఢవైఖరి అవలంబించబట్టే బిల్లు ఆమోదం పొందిందని స్పష్టం చేశారు. బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపి ఇన్ని రోజులైనా రాష్ట్రపతి ఆమోదం తెలపకపోవడాన్ని నాగం తప్పుబట్టారు. కేంద్రం ఈ విషయమై జవాబివ్వాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News