: లాలూ ప్రసాద్ కి 13 మంది ఎమ్మెల్యేల ఝలక్!
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు బీహార్ లో గట్టిదెబ్బ తగిలింది. ప్రత్యేక కూటమిగా మారిన 13 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కసారే పార్టీకి రాజీనామా చేశారు. తమను ప్రత్యేక కూటమిగా గుర్తించాలని వారంతా కలసి ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ కు లేఖ రాశారు. వారి లేఖను స్పీకర్ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఎమ్మెల్యేలంతా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జేడీ (యూ)లో చేరనున్నట్లు తెలుస్తోంది.