: జాలర్ల హత్య కేసులో ఇటలీ నావికాదళ అధికారులకు ఊరట


కేరళ తీరంలో ఇద్దరు జాలర్ల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఇటలీ నావికాదళ అధికారులకు ఊరట కలిగింది. మరణశిక్షను విధించే కఠినమైన యాంటీ పైరసీ చట్టం కింది నమోదైన ఈ కేసును ఆ సెక్షన్ నుంచి మినహాయిస్తున్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకు కోర్టు అనుమతిచ్చింది. అయితే, ఈ కేసులో ఎన్ఐఏ తన తదుపరి దర్యాప్తును కొనసాగించుకోవచ్చని చెప్పింది. 2012, ఫిబ్రవరిలో భారత జాలర్లను హత్య చేసిన వ్యవహారంలో ఇటలీ నావికా అధికారులపై కేసు నమోదైంది. అనంతరం ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) పూర్తి దర్యాప్తు జరిపి మరణ శిక్షకు అర్హమైన అభియోగాలు మోపింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఇటలీ తీవ్ర ఒత్తిడితో సుప్రీంను ఆశ్రయించింది. దానిపై వివరణ తెలపాలంటూ కోర్టు కేంద్రానికి నోటీసులు ఇవ్వడంతో భారత్ వెనుకంజ వేసింది.

  • Loading...

More Telugu News