: సీఎస్ తో ముగిసిన అంగన్ వాడీ కార్యకర్తల చర్చలు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)తో ఈరోజు సచివాలయంలో అంగన్ వాడీ కార్యకర్తల ప్రతినిధులు సమావేశమై చర్చలు జరిపారు. కనీస వేతనాలు పెంచాలన్న ప్రధాన డిమాండ్ సహా 11 అంశాలపై అంగన్ వాడీలు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా అంగన్ వాడీ కార్యకర్తలు తక్షణం సమ్మె విరమించాలని మహంతి కోరారు. అయితే, తమ డిమాండ్లకు ఒప్పుకొనేవరకు విధులకు హాజరయ్యేది లేదని సీఎస్ మహంతికి వారు స్పష్టం చేశారు. ఈ నెల 26వ తేదీన మరోమారు సమావేశమవుదామని సీఎస్ చెప్పారని వారు తెలిపారు.