: ఈ రోజు రాత్రి ఒక గంట చీకటి
ఈ రోజు రాత్రి 8.30కి మనం ఒక పనిచేయాలి. అవసరం లేని చోట వృధాగా వెలుగుతున్న లైట్లు, ఫ్యాన్లు ఇంకా ఎలక్ర్టిక్ పరికరాలు ఏవైనా సరే గడియారంలో ముల్లు 8.30ని సూచించిన వెంటనే ఆఫ్ చేయాలి. మళ్లీ 9.30 వరకూ ఆన్ చేయకూడదు. ఎందుకు? అంటే.. విద్యుత్ ఆదా చేయడానికి. అలా చేయడం వల్ల మానవాళికి, ప్రకృతికి మనం ఎంతో తోడ్పడిన వారమవుతాం.
విషయం ఏమిటంటే నేడు ఎర్త్ అవర్. అంటే భూమి కోసం ఒక గంట. మానవుడు ఆధునికంగా అభివృద్ధి చెందుతున్న ప్రతిదశలోనూ ప్రకృతిపై విధ్వంసం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అందుకే కనీసం ఒక గంటపాటైనా మన స్వార్థాన్ని వీడి పర్యావరణ ప్రయోజనం కోసం పాటుపడాలనే సంకల్పంలోంచి ఎర్త్ అవర్ పుట్టుకొచ్చింది. 'వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్' సంస్థ మొదలెట్టిన బృహత్తర కార్యక్రమం ఇది. ఏటా మార్చిలో ఒక రోజు రాత్రి వేళ ఒక గంటపాటు ఇది జరుగుతుంది. ఆ సమయంలో విద్యుత్ పరికరాల వాడకాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది.
భారతీయులలో విద్యుత్ వృధా అధికంగా ఉంది. షాపుల వద్ద అవసరం లేకపోయినా విద్యుత్ పరికరాలు వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాయి. కార్యాలయాలలో సిబ్బంది లేకపోయినా, ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు అన్నీ గిరగిరా తిరుగుతూనే ఉంటాయి. దానివల్ల ఎంతో విద్యుత్ వృధా. దీనివల్ల కంటికి కనిపించని నష్టం అపారం.
ఎలా అంటే ఒక యూనిట్ విద్యుత్ ను తయారు చేయడానికి వినియోగించే బొగ్గు, గ్యాస్ కారణంగా పలు హానికారక వాయువులు గాలిలోకి విడుదలవుతాయి. జలవిద్యుత్ సహా అన్నిరకాల విద్యుత్ తయారీకి నీరు చాలా అవసరం. అలా ఎంతో నీటి వృధా కూడా కొనసాగుతుంది. ఇవన్నీ కలిసి భూతాపం పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి. ఇది పెరిగితే ప్రాణుల మనుగడపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఈ ఎర్త్ అవర్ ను తీసుకొచ్చారు.
ఈ సారి ప్రపంచవ్యాప్తంగా ఏడువేలకు పైగా నగరాలు ఇందులో పాల్గొంటాయని 'వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్' భావిస్తోంది. మన దేశంలో పోయిన ఏడాది 150 నగరాలు, పట్టణాలు పాల్గొన్నాయి. అవి ఈ సారి మరింతగా పెరుగుతాయని సంస్థ ఆశిస్తోంది.
కనుక ఈ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 వరకూ అవసరంలేని విద్యుత్ ఉపకరణాలను వాడడం ఆపి, ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ రోజే కాదు, విద్యుత్ ఆదా చేయడం రోజువారీ కార్యక్రమంలో భాగం చేసుకోవాలని, అది జీవితంలో ఒక భాగం కావాలని, పర్యవరణాన్ని కాపాడుకోవాలని 'వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్' సంస్థ గట్టిగా కోరుతోంది.