: తెలంగాణకిక టీఆర్ఎస్ అవసరం లేదు: రేవంత్ రెడ్డి
తెలంగాణకిక టీఆర్ఎస్ అవసరం లేదని టీడీపీ తెలంగాణ ప్రాంత నేత రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనమా? పొత్తా? అనేది ప్రజలకు సంబంధించిన విషయం కాదని ఆయన చెప్పారు. ఈరోజు ఆయన హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ కు పార్లమెంటులో నోరు లేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఏడు అంశాలు రాజకీయ లబ్ది కోసమే కానీ, ప్రజలకు ఉపయోగపడేవి కావని ఆయన చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేసీఆర్ ఎందుకు అడగలేదని రేవంత్ ప్రశ్నించారు. పాలమూరు వలసల అంశాన్ని కేసీఆర్ ఎందుకు లేవనెత్తలేదని నిలదీశారు.