: వర్మ పొలిటికల్ ట్విటైర్లు!


రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. నిత్యం ఏదో ఒక అంశపై ట్విట్టర్లో స్పందించే వర్మ, తాజాగా, పొలిటికల్ అంశాలపై దృష్టిపెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్, లగడపాటి రాజగోపాల్ పై ట్విట్టర్లో పలు వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ తలకు మఫ్లర్ తో కనింపిచే కేజ్రివాల్ వేసవి వస్తే ఏంచేస్తారో చూడాలని ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. తలకు మఫ్లర్ లేని కేజ్రివాల్ ను చూడాలనుందని పేర్కొన్నారు. ఉవ్వెత్తున ఎగసి, సీఎం పీఠం వదిలేసి హఠాత్తుగా కిందపడ్డ ఆయన కేజ్రివాల్ కాదని కేజ్రిఫాల్ అని కూడా వర్మ అభివర్ణించారు. ఇక లగపాటి విషయానికొస్తూ... భగత్ సింగ్ తర్వాత పార్లమెంటును కుదిపేసిన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. పెప్పర్ స్ప్రేకి లగడపాటి మంచి పబ్లిసిటీ ఇచ్చారని కితాబిచ్చిన ఈ సెన్సేషనల్ డైరక్టర్, త్వరలోనే సమాజంలో పెప్పర్ స్ప్రేని విరివిగా ఉపయోగించడం చూస్తామని సెలవిచ్చారు.

  • Loading...

More Telugu News