: నేడు సీబీఐ ఎదుటకు కేవీపీ రామచంద్రరావు


రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీపి రామచంద్రరావు ఈ ఉదయం 11 గంటలకు సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. తమ ఎదుట హాజరు కావాలంటూ నిన్న సీబీఐ అధికారులు ఆయనకు సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని సీబీఐ కార్యాలయం దిల్ కుషా గెస్ట్ హౌస్ లో ఈ విచారణ జరగనుంది.

దివంగత వైఎస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో 
కేవీపి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఈ సమయంలో ప్రభుత్వ విషయాల్లో ఆయన ఎలాంటి సలహాలు ఇచ్చేవారన్న వాటిపైనే ప్రధానంగా సీబీఐ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మార్ కేసులో కేవీపి ఒకసారి సీబీఐ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News