: సోనియాకు కృతజ్ఞతగా వరంగల్ జిల్లాలో పర్యటన: వీహెచ్
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ రేపటి నుంచి వరంగల్ జిల్లాలో పర్యటన చేపడుతున్నట్లు రాజ్యసభ సభ్యుడు వి.హనమంతరావు తెలిపారు. ప్రతి గ్రామంలో సోనియా గురించి ప్రచారం చేస్తామని చెప్పారు. అయితే, ప్రజలెక్కడివారైనా ఎవరికీ హానీ జరగకుండా రక్షించే బాధ్యత తమపై ఉందని విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. సోనియా ఎప్పుడూ మాట మార్చలేదని, అందరూ యూ-టర్న్ తీసుకున్నా ఆమె మాత్రం తెలంగాణ విషయంలో వెనక్కి పోలేదన్నారు. ఆఖరు బంతి పేరుతో కిరణ్ కుమార్ రెడ్డి అందరినీ చుట్టూ తిప్పుకున్నారని వీహెచ్ ఆరోపించారు. కిరణ్ అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.