: ఆమె జన్మదినం రోజునే అత్యాచారం..!


సహచర విద్యార్థినిపై ఆమె జన్మదినం నాడే లైంగిక దాడి చేశాడో కామాంధుడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానె జిల్లాలో జరిగింది. కళ్యాణ్ ఏరియాలో పదమూడేళ్ల బాలిక ట్యూషన్ సెంటర్ కు వెళుతోంది. అదే సెంటర్ లో సంతోష్ (23) కూడా చదువుతున్నాడు. ఒకే ప్రాంతం నుంచి కోచింగ్ సెంటర్ కు వస్తుండటంతో వీళ్లిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అయితే, ఫిబ్రవరి 14న ఆమె పుట్టినరోజు. ఆరోజు ‘వాలెంటైన్స్ డే’ కావడంతో అందరూ కలిసి కోచింగ్ సెంటర్లో సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత, మేడ మీదకు తీసుకెళ్లి బాలికపై సంతోష్ అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంతోష్ పై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఆఫీసర్ వీకే హీరే చెప్పారు.

  • Loading...

More Telugu News