: సీమాంధ్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు


సీమాంధ్ర కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ వెంటనే ఢిల్లీ రావాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సూచించారు. వచ్చిన వెంటనే రేపు అందరితో దిగ్విజయ్ భేటీ కానున్నారు. కొత్త ముఖ్యమంత్రి నియామకం, ప్రభుత్వం ఏర్పాటు వంటి విషయాలపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణతో ఈ ఉదయం నుంచి చర్చలు జరిపిన అనంతరం డిగ్గీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దిగ్విజయ్ తో కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, పళ్లంరాజులు భేటీ అయ్యారు.

  • Loading...

More Telugu News