: కిరణ్ కొత్త పార్టీ పెడితే చందా ఇస్తా: డీఎల్
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే... చందా ఇస్తానని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు.