: పుర్రెను కాలిస్తే బంగారం వస్తుందనుకుని.. పోలీసులకు పట్టుబడ్డారు
ఇద్దరు వ్యక్తులు తాంత్రిక పూజలను నమ్మి పోలీసులకు పట్టుబడ్డారు. ఈ నెల 21 రాత్రి ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా... శ్మశానం వద్ద ఇద్దరు వ్యక్తులు పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించారు. వారిలో మున్నాలాల్ అనే వ్యక్తి అదే శ్మశానంలో పనిచేస్తుండగా, హబ్ లాల్ అతడి మిత్రుడు. ఆరోజు రాత్రి వీరు శ్మశానంలో రెండు రోజుల క్రితం పూడ్చిపెట్టిన శవాన్ని తవ్వితీశారు. దేహం నుంచి తలను వేరు చేశారు. మిగతా దేహాన్ని పూడ్చే ప్రయత్నంలో ఉండగా పోలీసులు చూశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఒక మాంత్రికుడు పుర్రెను కాలిస్తే బంగారంగా మారుతుందని చెప్పాడని... అందుకే ఈ పనిచేశామని చెప్పారు. వారిని కోర్టులో హాజరు పరచగా... జడ్జి రిమాండ్ విధించారు.