: కర్నూలును రాజధాని చేయండి: మంత్రి కోట్ల
విభజనతో ఉత్కంఠగా మారిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై పలువురు నేతలు స్పందిస్తున్నారు. రాజధానికి అనువైన ప్రదేశాలు ఇవేనంటూ పలు ప్రాంతాలను సూచిస్తున్నారు. ఏపీకి కర్నూలును రాజధాని చేయాలని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏకపక్షంగా జరిగిన రాష్ట్ర విభజనకు ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మాటమాత్రమయినా అడ్డు చెప్పలేదని మండిపడ్డారు. విభజన పాపంలో బీజేపీకి కూడా భాగస్వామ్యం ఉందని అన్నారు. అటు రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అధినేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా కర్నూలునే రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నారు.