: విరాట్ కోహ్లీ నోట వేదాంతం
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి తాత్కాలికంగా పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ నోట వేదాంతం పలుకుతోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రాక్టీసు సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. 'నేనీ ఒక్క టోర్నీకే సారథిని. రెగ్యులర్ గా కెప్టెన్సీ వహించడం కంటే ఇది భిన్నమైనది. గెలిచినప్పుడు పొగుడుతారు, ఓడినప్పుడు విమర్శిస్తారు. జీవితంలో ఇదో భాగమంతే' అంటూ నిట్టూర్చాడు. ఏదేమైనా తాము గెలిచేందుకే బంగ్లాదేశ్ వచ్చామని చెప్పాడు. బంగ్లాదేశ్ లోని పలు వేదికలపై రేపటి నుంచి ఆసియా కప్ క్రికెట్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. భారత్ తన తొలి మ్యాచ్ ను ఎల్లుండి బంగ్లా జట్టుతో ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మార్చి 2న తలపడుతుంది. ఈ మ్యాచ్ పై కోహ్లీని స్పందన కోరగా, ఆ ఒక్క జట్టుతో పోరునే కీలకంగా పరిగణించరాదని, ప్రతి మ్యాచ్ కూడా ముఖ్యమైనదే అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.