: చంద్రబాబు సీమాంధ్ర శిల్పి: సోమిరెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల సీమాంధ్రకు నష్టం లేదని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ రోజు సీమాంధ్ర నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబును సీమాంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దే శిల్పిగా అభివర్ణించారు. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికపై పార్లమెంటులో ఎందుకు చర్చించలేదని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.