: భారత్ లో మిగిలే ఉన్న కుల దురంహకార ఛాయలు
భారత్ లో కులాల మధ్య అంతరాలు క్రమేణా తగ్గుతున్నాయని భావిస్తున్న తరుణంలో, కుల రక్కసి మరోసారి పొడసూపింది. ఢిల్లీ శివార్లలో ఓ దళిత యువకుడిపై ఇద్దరు అగ్రవర్ణ యువకులు జులుం ప్రదర్శించారు. వివరాల్లోకి వెళితే... సుమీత్ సింగ్ అనే దళితుడు పెళ్ళి చేసుకుంటుండగా, అగ్రకులాలకు చెందిన ఇద్దరు సోదరులు అతడిని నానా దుర్భాషలాడారు. గుర్రపు బగ్గీపై కూర్చున్న ఆ దళితుడిని కిందికి లాగి, పెళ్ళి మంటపం నుంచి 200 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్ళారు. 'నువ్వు తక్కువ కులస్తుడివి. నీకు బగ్గీ ఎక్కే అర్హత లేదు. ముందు మురికి కాల్వలు శుభ్రం చేసి, ఆ తర్వాత పెళ్ళి చేసుకో' అని దురహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై సుమీత్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు ఆ సోదరులిద్దరిపై స్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.