: హైదరాబాదు చేరుకున్న ఈటెల, హరీష్ రావుకు ఘనస్వాగతం


తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాదుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో బయల్దేరి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వారిరువురికి టీఆర్ఎస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడారు. 26వ తేదీన ప్రత్యేక విమానంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాదుకు చేరుకుంటారని ఆయన తెలిపారు. కేసీఆర్ రాక సందర్భంగా, ఆ రోజున బేగంపేట నుంచి గన్ పార్కు అమరవీరుల స్థూపం వరకు భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు ఈటెల చెప్పారు.

  • Loading...

More Telugu News