: షిండేపై పిల్ కొట్టివేసిన సుప్రీం


కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడయిన ఓ వ్యాపారవేత్తను కాపాడేందుకు షిండే ప్రయత్నిస్తున్నారని, అందుకోసం అబద్దాలు చెబుతున్నారని, అంతేగాక ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఆ వ్యాపారవేత్తను విచారించకుండా ఢిల్లీ పోలీసుల నుంచి రక్షిస్తున్నారని హోంశాఖ మాజీ సెక్రటరీ ఆర్ కె సింగ్ తన పిల్ లో ఆరోపించారు. పలు సంస్థలు అతనిని అనుమానిస్తున్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తన ఆరోపణల ఆధారంగా షిండేపై దర్యాప్తుకు ఆదేశించాలని సింగ్ కోర్టును కోరారు.

  • Loading...

More Telugu News