: చిరుత సంచారంతో బోసిపోయిన మీరట్ పట్టణం


ఉత్తరప్రదేశ్ లోని మీరట్ పట్టణవాసుల్ని ఓ చిరుత వణికిస్తోంది. సమీప అడవుల్లోంచి ఆదివారం పట్టణంలోకి చొరబడ్డ ఇది కంటోన్మెంట్ ప్రాంతంలో దర్శనమిచ్చింది. భయంతో జనం పరుగులు తీశారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరపగా.. చిరుత గోడెక్కి ఒక ఆస్పత్రిలోకి ప్రవేశించింది. అక్కడి సిబ్బంది దాన్ని తెలివిగా ఓ గదిలో బంధించారు. ఏం జరుగుతుందోనన్న ఆసక్తి, ఆందోళనతో ప్రజలు వందలాదిగా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అయినా అది కిటీకి ద్వారా తప్పించుకుపోయింది. దాంతో నగరంలో ఎక్కడ ఎవరిపై దాడి చేస్తుందోనన్న భయంతో ఈ రోజు పట్టణం నిర్మానుష్యంగా మారిపోయింది. ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు. స్కూళ్లు, దుకాణాలు మూతబడ్డాయి. ప్రత్యేక బృందాలు చిరుత కోసం గాలిస్తున్నాయి.

  • Loading...

More Telugu News