: 'ఆస్కార్' నుంచి మండేలా కుమార్తెలకు ఆహ్వానం
దక్షిణాఫ్రికా దివంగత మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా కుమార్తెలు జిండ్ జివా, జెనానీలకు 86వ 'ఆస్కార్' అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానం అందింది. మండేలా జీవితం ఆధారంగా రూపొందిన 'మండేలా: లాంగ్ వాక్ టు ఫ్రీడమ్' చిత్రంలోని 'ఆర్డినరీ లవ్..' పాట ఆస్కార్ నామినేషన్స్ కు అర్హత సాధించింది. అవార్డుల వేదికపై ఆ పాటను ప్రదర్శించనున్న నేపథ్యంలో పాల్గొని వీక్షించాలని మండేలా కుమార్తెలను 'ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ ఆండ్ సైన్సెస్' కోరింది. అనారోగ్యం కారణంగా గతేడాది మండేలా మరణించిన సంగతి తెలిసిందే.