: 'తెహల్కా' మాజీ ఎడిటర్ జైలు గది నుంచి మొబైల్ స్వాధీనం


అత్యాచార ఆరోపణలతో గోవా జైల్లో ఉన్న 'తెహల్కా' మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ గది నుంచి పోలీసులు నిన్న (ఆదివారం) సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇతర ఖైదీల వద్ద కూడా మొబైల్ ఫోన్లు దొరికినట్లు అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా నిర్వహించిన తనిఖీల సమయంలో సెల్ ఫోన్లు ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. అయితే, తన వద్ద ఫోన్ దొరికిందన్న వార్తలను తేజ్ పాల్ ఖండించారు. కాగా, ఆయన బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో మొబైల్ విషయం ప్రభావం చూపనుంది.

  • Loading...

More Telugu News