: కిరణ్ పార్టీ కోసం పరిశీలనలో నాలుగు పేర్లు
సమైక్య రాష్ట్రం కోసం చివరికంటా పోరాడి, కేంద్రం నిర్ణయంతో హతాశుడైన కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆయన పెట్టబోయే పార్టీకి నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అవి... సమైక్య రాష్ట్ర సమితి (బ్యాట్ గుర్తు), సమైక్యాంధ్ర పార్టీ (గాలిపటం గుర్తు), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి (బ్యాట్స్ మన్ గుర్తు), జై సమైక్యాంధ్ర పార్టీ (చెప్పు గుర్తు). కాగా, బుధవారం పార్టీని ప్రకటించేందుకు కిరణ్ వర్గం సన్నాహాలు చేస్తోంది. నేడు హైదరాబాదులో జరిగిన భేటీలో ఈ విషయమై కిరణ్ తన మద్దతుదారులతో లోతుగా చర్చించారు.