: రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో 'గేమ్' నగరం
యానిమేషన్ రంగానికి రాష్ట్రంలో మంచి రోజులు రానున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాదు నగరంలో 'గేమ్' (గేమింగ్, యానిమేషన్, మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్) ను ప్రోత్సహించడానికి ఐటీ శాఖ ఓ పాలసీని రూపొందిస్తోంది. ఆధునాతన సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో ఈ 'గేమ్' నగరాన్ని నెలకొల్పడంతో బాటు శిక్షణ నిచ్చే ఓ అకాడమీని కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. నగరంలో యానిమేషన్ రంగం బాగా విస్తరిస్తున్నందున, ఎంతో మంది ఈ రంగంలో ఉపాథి పొందుతున్నందున దీనిని మరింతగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ ప్రాజక్టును చేబట్టింది. ఈ 'గేమ్' నగరంలో ఎటువంటి ప్రాజక్టు పూర్తి చేసుకోవడానికైనా అన్ని వసతులూ వుంటాయి.