: ఫేస్ బుక్ ఖాతాకు మరణంలేదు!


మనిషి మరణించినా అతని ఫేస్ బుక్ ఖాతా మాత్రం ఇకపై సజీవం. వ్యక్తి తన ఫేస్ బుక్ ఖాతాలో పొందుపరిచిన జ్ఞాపకాలను ఇక మీదట ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వ్యక్తులే కాదు, ఎవరైనా చూడొచ్చట. ఈ మేరకు ఫేస్ బుక్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మరణానంతరం కూడా అతనికి సంబంధించిన ప్రొఫైల్ లో ఎలాంటి మార్పులు చేయరు. ఎవరైనా అతని ఖాతాను యాక్సెస్ చేయవచ్చు. ఆ పేజినీ దర్శించేందుకు ఎలాంటి పాస్ వర్డ్ అవసరంలేదు. తద్వారా, అతని జ్ఞాపకాలు అందరూ వీక్షించవచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యుల విన్నపం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్ బుక్ తెలిపింది.

  • Loading...

More Telugu News