: కొత్త సీఎం ఎవరన్నది పార్టీ నిర్ణయిస్తుంది: షిండే
కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. రాష్ట్ర విభజన ప్రక్రియకు ఇంకా మూడు నెలలు పట్టే అవకాశం ఉండడంతో ఒకే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని షిండే తెలిపారు. అయితే, ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.