: తీవ్రవాద పీడిత దేశాల్లో ఇరాక్ తర్వాత పాకిస్తానే...!


ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతల్లో తీవ్రవాదమే అత్యంత ప్రమాదకరమైనది. ముఖ్యంగా, మత ప్రాతిపదికన పురుడుపోసుకున్న టెర్రరిజం అత్యంత భయానకం. ఆత్మాహుతి దాడులు, పేలుళ్ళు, కాల్పులు... ఇలా ఉంటుంది కొన్ని దేశాల్లో. అక్కడి జనజీవనం నిత్యం రక్తసిక్తం. ప్రశాంతతకు దూరమైన అక్కడి ప్రజలు దుర్భరంగా బతుకులీడుస్తుంటారు. మతోన్మాదం తలకెక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఇరాక్, పాకిస్తాన్ వంటి దేశాలపై దృష్టి సారించాలి. తాజాగా ఓ నివేదిక ఆ విషయాన్నే స్పష్టం చేస్తోంది. ప్రపంచంలోకెల్లా తీవ్రవాద పీడిత దేశాల్లో ఇరాక్, పాకిస్తాన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయట.

2001 నుంచి 2013 మధ్య కాలంలో పాకిస్తాన్ లో 13,721 తీవ్రవాద ఘటనలు చోటుచేసుకున్నాయని సదరు నివేదిక వెల్లడిస్తోంది. ఈ విషయంలో ఇరాక్ కు పాకిస్తాన్ కు మధ్య తేడా స్వల్పమే. ఈ జాబితాలో మూడో స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. అమెరికాకు చెందిన నేషనల్ కన్సార్టియం ఫర్ ద స్టడీ ఆఫ్ టెర్రరిజం అండ్ రెస్సాన్సెస్ ఫర్ టెర్రరిజం ఈ వివరాలను వెల్లడించింది.

  • Loading...

More Telugu News