: జగ్గారెడ్డిపై డిప్యూటీ సీఎం భార్య ఆగ్రహం
విప్ జగ్గారెడ్డిపై ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భార్య పద్మిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా సంగారెడ్డిలో పోలింగ్ బూత్ లను ఆక్రమిస్తానన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలు అప్రజాస్వామికమని పద్మిని మండిపడ్డారు. జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి, గవర్నర్, ఈసీలతో పాటు అన్ని పార్టీల నేతలకు లేఖలు రాశానని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో జగ్గారెడ్డిపై పోటీ చేస్తానని వెల్లడించారు.