: సిక్కు వేషంలో ఆకట్టుకున్న మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ లుథియానా సభకు సిక్కు వేషంలో హాజరై సభికులను ఆకట్టుకున్నారు. అంతేగాకుండా, స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ వారి మనసు చూరగొనే యత్నం చేశారు. పంజాబ్ లో అధికారంలో ఉన్న అకాలీదళ్ పార్టీతో బీజేపీ మైత్రి హిందువులు, సిక్కుల మైత్రికి నిదర్శనమని చెప్పారు. గుజరాత్, పంజాబ్ మధ్య చారిత్రక సంబంధాలున్నాయని వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సిక్కులు, గుజరాతీలు కనిపిస్తారని చెప్పుకొచ్చారు. పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. కాగా, గుజరాత్ లో సిక్కు రైతులను లక్ష్యంగా చేసుకున్నట్టు రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని మోడీ మండిపడ్డారు.