: ఏ అంటే ఆదర్శ్... బీ అంటే బోఫోర్స్... సీ అంటే కోల్ గేట్!: మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నేడు పంజాబ్ లోని లుథియానాలో ఓ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ను తూర్పారబట్టారు. కుంభకోణాలన్నీ వారి హయాంలో జరిగితే ఇతర పార్టీలపై బురదజల్లుతున్నారని విమర్శించారు. ఏబీసీలు కాంగ్రెస్ అవినీతికి పర్యాయపదాలని అని అభివర్ణించారు. ఏ అంటే ఆదర్శ్... బీ అంటే బోఫోర్స్... సీ అంటే కోల్ గేట్ అని చెప్పాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇక, కాంగ్రెస్ యువరాజు రాహుల్ పైనా వాగ్బాణాలు సంధించారు మోడీ. రాహుల్ తనను తాను అవినీతిపై యుద్ధం చేస్తున్న వీరుడిలా ప్రచారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.