: ధోనీ ఎందుకు... కోహ్లీ ఉండగా: చాపెల్


ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ భారత క్రికెట్ వ్యవహారాలపై స్పందించాడు. మెతక వైఖరి అనుసరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో దూకుడుగా వ్యవహరించే విరాట్ కోహ్లీకి టెస్టు కెప్టెన్సీ అప్పగించాలని సూచించాడు. ధోనీ వరస చూస్తుంటే, అబ్సెంట్ మైండ్ ప్రొఫెసర్ పార్కులో తీరిగ్గా పచార్లు చేస్తున్నట్టుందని చాపెల్ విమర్శించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ కు సంబంధించినంత వరకు ధోనీ తెలివైన నాయకుడు అనడంలో సందేహం అక్కర్లేదని, మిడిలార్డర్ లో అద్భుతమైన ఫినిషర్ అని పేర్కొన్నాడు. కానీ, టెస్టుల్లో ధోనీ అతిగా స్పందిస్తూ మ్యాచ్ లను సాగదీస్తున్నాడని ఈ ఆల్ రౌండర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. పట్టు బిగించాల్సిన సమయాల్లో ప్రత్యర్థికి కోలుకునే వ్యవధి ఇస్తున్నాడని చెప్పాడు. అలాంటి సమయాల్లో కోహ్లీలా త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే నాయకుడి అవసరం ఎంతో ఉంటుందని వివరించాడు. అతడి బ్యాటింగ్ లో ఎంత దూకుడు ఉంటుందో, అతడి కెప్టెన్సీ కూడా అలాగే ఉంటుందని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News