: జి20 సదస్సు సంతృప్తికరంగా ముగిసింది: చిదంబరం
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన జి20 దేశాల సమావేశం సంతృప్తికరంగా ముగిసిందని ఆర్ధిక మంత్రి చిదంబరం తెలిపారు. ఐఎంఎఫ్ సంస్కరణల విషయంలో భారత ఆందోళనలను చల్లబరిచే విధంగా ఈ సమావేశం సాగిందని వెల్లడించారు. భారత్ అభిప్రాయాలను ఈ వేదికపై స్పష్టంగా ప్రతిబింబించామని చెప్పారు. జి20 దేశాల ఆర్ధిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్లు పాల్గొన్న నేటి సమావేశంలో సభ్య దేశాల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెంపొందించుకునేందుకు సమష్టిగా కృషి చేయాలని తీర్మానించినట్టు చిదంబరం వెల్లడించారు. వచ్చే ఐదేళ్ళలో రెండు శాతం అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.