: ఆటోను ఢీకొన్న కల్వకుర్తి ఎమ్మెల్యే కారు
మహబూబ్ నగర్ జిల్లా ఉప్పునుంతల మండలం కట్లబండ వద్ద కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కారు ఓ ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఎమ్మెల్యే సురక్షితంగా ఉన్నారు.