: చీకట్లో స్మార్ట్ ఫోన్ వాడితే.. జీవితం మసకే
రాత్రిళ్లు నిద్ర పోకుండా చీకట్లో గంటలకొద్దీ స్మార్ట్ ఫోన్ పై కాలక్షేపం చేస్తున్నారా? అయితే, మీ చూపుకు ముప్పున్నట్లే. ఎందుకంటే, ఇలాంటి ఒక కేసు చైనాలో వెలుగు చూసింది. లీ అనే చైనా మహిళ రోజూ రెండు నుంచి మూడు గంటల పాటు రాత్రి వేళ చీకట్లో స్మార్ట్ ఫోన్ పై కాలక్షేపం చేసేది. అయితే కొన్నాళ్లుగా ఆమె కుడి కంటి చూపు మసకబారింది. వైద్యుల వద్దకు వెళితే రెటీనా విడిపోయినట్లు (రెటీనా డిటాచ్ మెంట్) గుర్తించారు. వైద్యులు తన ఎడమకన్నును మూసినప్పుడు.. కుడి కన్నుతో చూసే ప్రతీ వస్తువు వక్రీకరణకు గురైందని లీ తెలిపింది. చీకట్లో ఫోకస్ తో కూడిన వెలుగు కంటిపై ఎక్కువ సమయం పాటు పడితే కంటి లెన్స్ లో మార్పులు జరుగుతాయని ఆప్తల్మాలజిస్ట్ జహో బింగ్ కన్ చెప్పారు.