: ఆ ఎంపీలతో కిరణ్ సమావేశం
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఎంపీలు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, సాయి ప్రతాప్, సబ్బం హరి తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఒక హోటల్లో వీరి సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో శైలజానాథ్, పితాని సత్యన్నారాయణ కూడా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినందుకు ఈ ఎంపీలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే.