: 'సైకిల్'పై సవారీకి సిద్ధమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర రెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ పార్టీలు తనను వంచించాయని ఆరోపించారు. టీడీపీలో తనకు న్యాయం జరుగుతుందున్న నమ్మకం ఉందని చెప్పారు. ఆదాల నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు.