: హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులంతా తెలంగాణ వారే: డీఎస్
పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ హైదరాబాదులో ఈ ఉదయం మీడియాతో మాట్లాడారు. హైదరాబాదులో ఉన్నవారంతా తెలంగాణ వారే అని స్పష్టం చేశారు. ప్రస్తుత తరుణంలో సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయరాదని హితవు పలికారు. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని వేనోళ్ళ కీర్తించారు. సోనియా వల్లే తెలంగాణ సాధ్యమైందని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్లమెంటు ఉభయసభల్లో తెలంగాణ బిల్లును సోనియా పాస్ చేయించారని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను మేడమ్ నిలుపుకున్నారని డీఎస్ పేర్కొన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు కిరణ్ కుట్ర చేశారని ఆరోపించారు. ఇకపై నేతలు ప్రాంతీయ విద్వేషాలకు తావు లేకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పాటుపడాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలంతా సంసిద్ధులై ఉండాలని ఉద్బోధించారు.