: పేలుళ్ళు ఇండియన్ ముజాహిదిన్ పనే: నిర్ధారణకు వచ్చిన ఎన్ఐఏ
హైదరాబాద్ జంట పేలుళ్ళ ఘటనకు కారకులు ఇండియన్ ముజాహిదిన్ తీవ్రవాదులేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్ధారణకు వచ్చింది. ఇండియన్ ముజాహిదిన్ తీవ్రవాది తబ్రేజ్ పేలుడు సంభవించడానికి 20 నిమిషాల ముందు ఓ సైకిల్ తీసుకువచ్చి సంఘటనాస్థలంలో నిలిపినట్టు సీసీ కెమెరా పుటేజీల్లో తేలిందని ఎన్ఐఏ తెలిపింది.
కాగా, తీవ్రవాదులు దిల్ సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లోనే మకాం ఏర్పాటు చేసుకుని ఉంటారని అనుమానిస్తున్న ఎన్ఐఏ.. స్థానిక పోలీసుల సహకారంతో ఈ విషయమై ఆరా తీస్తామని వెల్లడించింది. వారు సైఫాబాద్ లో నివాసం ఉన్నట్టు సమాచారముందని కూడా దర్యాప్తు సంస్థ పేర్కొంది.