: నేడు ముగ్గురు యోధుల ప్రచార ర్యాలీలు
ఎన్నికల వేడి రోజురోజుకూ రాజుకుంటోంది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ, కాంగ్రెస్ భావి ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి కేజ్రీవాల్ ముగ్గురూ ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. మోడీ పంజాబ్ లోని లుధియానాలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో, కేజ్రీవాల్ హర్యానాలోని రోహ్ తక్ లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. లోక్ సభ ఎన్నికల సంగ్రామానికి సంబంధించి ఆమ్ ఆద్మీకి ఇదే తొలి ప్రచార సభ. కేజ్రీవాల్ తన సొంత రాష్ట్రమైన హర్యానా నుంచే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.