: పీసీసీ అధ్యక్ష పదవికే నా ఓటు: బొత్స


కాంగ్రెస్ పార్టీలో జోడు పదవులపై స్వారీ చేస్తున్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పీసీసీ అధ్యక్ష పదవికే తన ఓటు అని చెబుతున్నారు. అయితే, తుది నిర్ణయం అధిష్ఠానానిదే అని బొత్స స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్న బొత్స రవాణా శాఖ మంత్రిగానూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన భేటీలో జోడు పదవుల వ్యవహారం చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీలో రెండు పదవుల సంప్రదాయానికి స్వస్తి చెప్పాలని అప్పట్లో రాహుల్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బొత్స తనకు పీసీసీ పదవే ముద్దు అంటున్నారు. 

  • Loading...

More Telugu News