: సినీ నటి ఇంట్లోని స్విమ్మింగ్ పూల్ లో శిశువు మృతదేహం


బాలీవుడ్ నటి దివంగత నూతన్ నివాసంలో శిశువు మృతదేహం కనిపించింది. థానే లోని ఖరేగావ్, పర్సిక్ హిల్స్ లో ఉన్న నూతన్ బంగళా లోపల ఉన్న స్విమ్మింగ్ పూల్ లో శిశువు మృతదేహం బయటపడిందని పోలీసులు ఈరోజు తెలిపారు. గత ఐదు రోజులుగా శిశువు మృతదేహం అక్కడే పడి ఉండటంతో.. కుళ్లిపోయిన స్థితిలో వెలికితీసినట్లు పోలీసులు చెప్పారు. వారం రోజులు కూడా నిండని ఆ శిశువు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News