: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు
2014-15 వార్షిక బడ్జెట్ కు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మొత్తం బడ్జెట్ రూ.2,401 కోట్లని పేర్కొంది. అందులో భాగంగా 1,793 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, 1,040 మంది ఉద్యోగులకు అపార్ట్ మెంట్స్ లో ఫ్లాట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఉద్యోగులకు తెల్ల కార్డ్ ప్రాతిపదికన ఉచిత వైద్య సదుపాయం కల్పించనున్నట్టు తెలిపింది. పద్మావతి అమ్మవారి ఊరేగింపు వాహనాలకు రూ.8.5 కోట్లతో బంగారు తాపడం చేయించనుంది. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా రూ.900 కోట్ల ఆదాయం వస్తుందని, తలనీలాల ద్వారా రూ.220 కోట్లు, ప్రసాద విక్రయాల ద్వారా రూ.130 కోట్ల ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేసింది.